నేటి సాక్షి, కొడిమ్యాల : శుక్రవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని కొండాపురం మైసమ్మ చెరువులో ఏటా కొన్ని లక్షల పెట్టుబడితో నూట ఇరవై ఆరు కుటుంబాల మత్స్యకారులం చేపల పెంపకం చేస్తు వాటిని పట్టి అమ్ముకొని జీవనోపాధి చేసుకుంటూ జీవిస్తుంటాం. అలాంటి చెరువులో గ్రామంలోని చనిపోయిన పందులని. వేయడంతో అవి నీటిలో పూర్తిగా కుళ్లిపోయి వాసన రావడం. డంపు యార్డులో వేసే చెత్తాచెదారం అంతా చెరువులో వేయడంతో నీళ్లు కలుషితమై చెపలు ఆ చెత్తంతా తిని వేల చెపలు చనిపోవడమే కాకుండా ఆ చెరువులోని చేపలను తినే మనుషులకు కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని. చెపల పెంపకాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న మాకు అన్యాయం జరుగుతుంది. మమ్మల్ని పట్టించుకోండి అని మత్స్యకారుల సంఘ అధ్యక్షులు రాగం శంకర్, ఉపాధ్యాక్షులు తోడేటి భూమేష్, కార్యదర్శి కనకట్ల నరేష్, లు తగు అధికారులకు నాయకులకు వాళ్ల బాధని వెళ్లబోసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు




