Wednesday, March 18, 2026

మహతి కళాక్షేత్రంలో ఘనంగా గీతం స్కూల్ వార్షికోత్సవం

  • గీతం స్కూల్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
  • ఏకాగ్రతతో విద్యను అభ్యసిస్తే విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు
  • అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లలకు అందిస్తూ విద్యాబోధన కొనసాగించాలి
  • చిన్నపిల్లలను సెల్ ఫోన్ లకు బానిసను చేయకండి
  • విద్యాబుద్ధులతో పాటుగా పిల్లలకు క్రీడలు చాలా అవసరం
  • తెలిపిన ఎమ్మెల్యే పులివర్తి నాని

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల):
తిరుపతి పట్టణంలోని మహతి కళాక్షేత్రంలో శుక్రవారం గీతం స్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఎమ్మెల్యే పులివర్తి నాని పాఠశాల యాజమాన్యం, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గీతం స్కూల్ యాజమాన్యం నిర్వహించిన వార్షికోత్సవంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎమ్మెల్యే తిలకించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతం స్కూల్ వార్షికోత్సవానికి రావడం చాలాఆనందంగా ఉంది అని…. స్కూల్ లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు ఏకాగ్రతతో విద్యను అభ్యసిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అని అన్నారు . విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలి. క్రమశిక్షణతో నడుచుకుంటే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని విద్యార్థులకు ఉపదేశిస్తూ ఇంటి వద్ద తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల వారి ప్రవర్తన పట్ల జాగ్రత్తలు పాటించాలని అలాగే వారిని సెల్ఫోన్లకు బానిసను చేయకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అవసరమైన మేరకు సెల్ఫోన్ వాడుకునే విధంగా పిల్లలను తీర్చిదిద్దాలని ఖాళీ సమయంలో క్రీడల పట్ల ఆసక్తిని కలిగించే విధంగా పర్ఫీజ్ నివ్వాలని కోరారు. విద్యార్థులకు ఉన్నత మైన విద్యను అందించడమే లక్ష్యంగా గీతం స్కూల్ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం పలువురు విద్యార్ధులకు ప్రోత్సాహక ధ్రువపత్రాలను, బహుమతులను ప్రదానం చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని. ఈ కార్యక్రమంలో గీతం స్కూల్ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News