- – దళితబంధు యూనిట్లను గ్రౌండింగ్ అయ్యేలా చూడండి
- – మంత్రి పొన్నంను కోరిన దళితబంధు సాధన సమితి సభ్యులు
నేటి సాక్షి, జమ్మికుంట (మోరె ప్రశాంత్) : హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితబంధు రెండో విడత నిధులను వెంటనే మంజూరు చేసేలాగా ముఖ్యమంత్రి తో మాట్లాడాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను దళితబంధు సాధన సమితి హుజూరాబాద్ నియోజకవర్గ సభ్యులు కోరారు. మంగళవారం కొత్తకొండలో మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 9 నెలలు గడుస్తున్నా, ఇప్పటి వరకు దళితబంధు గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదని, వెంటనే నిధులపై ఉన్న ఫ్రీజింగ్ ఎత్తివేసి, యూనిట్లను గ్రౌండింగ్ చేసేలాగా చొరవ తీసుకోవాలని మంత్రిని కోరారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో సుమారుగా 4900 కుటుంబలు రోడ్డున పడే ప్రమాదం ఉందని చెప్పారు. ఇప్పటికే చాలా మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి, తమ సమస్య పరిష్కరించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో దళితబంధు సాధన సమితి సభ్యులు కోలుగూరి సురేష్, కోలుగూరి నరేష్, అకినపల్లి ఆకర్షన్, ఇనుగాల భిక్షపతి, కోడెపాక రక్షిత్, దసరాపు నాగరాజు, మహంకాళి రమేష్, సరిగోమ్ముల విజయ్ తదితరులు పాల్గొన్నారు.

