Monday, March 16, 2026

జీజీహెచ్ పెండిగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి

  • జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ) : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) అభివృద్ది పై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష సమావేశం నిర్వహించారు. పిడియాట్రిక్ వార్డు, పోస్టు ఆపరేటివ్ వార్డు, ఓటీ వెనుక వైపున గల లీకేజిలు, ఎస్.ఎన్.సీ.యూలో సీలింగ్ మరమ్మతులు, సూపరింటెండెంట్ ఛాంబర్ ప్రక్కన గల రూమ్లలో పైకప్పు మరమ్మత్తు, ఓ.పి గేట్ – 1 ముందు నుండి ఎమర్జెన్సీ వార్డు వరకు గల ఖాళీస్థలంను ద్విచక్ర వాహనాల పార్కింగ్, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్, అత్యవసర పేషెంట్లను మెరుగైన చికిత్సల కొరకు జీజీహెచ్ నుంచి ఉస్మానియా / గాంధీ ఆసుపత్రికి తరలింపు కొరకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఏర్పాటు అంశాలపై చర్చించారు. క్లీనింగ్, ఇతర పనులు సంబంధిత శాఖల అధికారులతో చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీనారాయణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా వైద్య అధికారి రజిత, వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News