జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్
నేటి సాక్షి, మంచిర్యాల బ్యూరో:-
జిల్లా బాలల రక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది బృందం మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో కాపాడిన 8 సంవత్సరాల బాలికకు ప్రభుత్వ బాలికల గృహంలో ఆశ్రయం కల్పించడం జరిగిందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం జనవరి 15వ తేదీన మంచిర్యాల రైల్వేస్టేషన్ సమీపంలో 8 సంవత్సరాల బాలిక కాజల్ ను రెస్క్యూ చేయడం జరిగిందని, బాలల పరిరక్షణ సమితి ముందు బాలికను హాజరు పరిచి వారి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ బాలికల గృహంలో ఆశ్రయం అందించి సంరక్షణ కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు ఈ బాలికకు సంబంధించిన వాళ్లు ఎవరు రాలేదని, ఈ బాలికకు సంబంధించి ఎవరైనా ఉన్నట్లయితే తగిన ఆధారాలతో జిల్లా కేంద్రంలోని బాల రక్ష భవన్, నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని, వివరాలకు 8886592786, 9441506519, 9908541697 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.





