- డిస్టిక్ మిషన్ కో ఆర్డినేటర్ అశ్విని

నేటి సాక్షి, మెట్ పల్లి (గోరుమంతుల నరేందర్) : ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుంటూ దేశ ప్రగతికి రథ చక్రాలుగా మారాలని,వారి అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి పాటుపడాలని, డిస్టిక్ మిషన్ కో ఆర్డినేటర్ అశ్విని అన్నారు. బేటి బచావో బేటి పడావో స్కీమ్ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు మానసిక ఆరోగ్యం మరియు ప్రేరణ అంశాల పైన అవగాహన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నేటితరం విద్యార్థిని విద్యార్థులు ఆకర్షణలకు లోన్ అవుతున్నారని ముఖ్యంగా మొబైల్ ఫోన్, ప్రేమ ఆకర్షణలోకి లోన్ అవుతున్నారని అన్నారు. అలాంటి ఆకర్షణ పట్ల అప్రమత్తం గా ఉండాలని సూచించారు.ఆడ పిల్లలకి సేఫ్ టచ్ అండ్ సేఫ్ టచ్ గురించి చెబుతూ వారికి విద్య అభివృద్ధికి తోడ్పడే విధంగా చదువుని కొనసాగించాలని పేర్కొన్నారు. బాల్య వివాహాల వలన వచ్చే నష్టం గురించి విద్యార్థుల కు వివరించారు.అలాగే బాలల హక్కు గురించి విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిహెచ్ఎస్ (బాలికల) హెడ్మాస్టర్ రఘుపతి రావు, మహిళా సాధికారత కేంద్రం డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ అశ్విని, చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్సిలర్ మానస, మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ గౌతమి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.





