నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల (కోక్కుల వంశీ) : జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గిటే మహేష్ బాబాసాహెబ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీగా నియమించబడిన గిటే మహేష్ బాబాసాహెబ్ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అఖిల్ మహాజన్ ఐపీఎస్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని సామాన్యుడిని దృష్టిలో పెట్టికోని వారికి భరోసా కలిగించే విధంగా పోలీస్ శాఖ వుంటుందని, శాంతి భద్రతల విషయంలోను కఠినంగా వుంటామని, ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పావని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేసారు.



