- మహిళలకు మాత్రం ఉచిత ప్రయాణం ఇచ్చారు( దివ్యాంగుల ఏ పాపం చేశారు)?
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు ఎన్నికల ముందు ఉచిత ప్రయాణం అని చెప్పి ఈ ప్రభుత్వం ఇంతవరకు ఉచిత ప్రయాణం కల్పించడం లేదు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతున్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణం లేదు ఇది ఎంతవరకు సమజసం అని తెలంగాణ దివ్యాంగులు అంటున్నారు. అలాగే దివ్యాంగులు ఇతరత్రా పనులు చేసుకోవడానికి, అలాగే కొంతమంది ఉద్యోగం చేసుకోవడానికి, ఇతర ప్రాంతాలకు పోవాలన్న, 50% చార్జీలు పెట్టుకొని పోవాలంటే ఆర్థిక పరిస్థితి భారమవుతుందని అంటున్నారు. ఇప్పటికైనా దివ్యాంగుల సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అమలు చేయాలని అంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దివ్యాంగుల ఓట్లు కీలకపాత్ర పోషించిన విషం తెల్వాద అని అంటున్నారు. వెంటనే ఈ సమస్య తీర్చాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.





