నేటిసాక్షి /వాజేడు: రాజ్యాంగ నేత, భారతరత్న, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు, జయంతి ఉత్సవాలు జరుపుకొనుటకై వాజేడు మండల కేంద్రంలో స్థలం కేటాయించాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ మండల కమిటీ బుధవారం స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం ఇచ్చారు తహసీల్దార్ శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కారం చిరంజీవి, జనగం కేశవరావు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరివాడని, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి, నేటి వరకు వాజేడు మండల కేంద్రంలో రాజ్యాంగ నేత విగ్రహం లేకపోవడం బాధాకరమని అన్నారు. బహుజన సమాజ్ పార్టీ తరఫున అంబేద్కర్ విగ్రహ నిర్మాణం మండలంలో చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు.





