Wednesday, March 25, 2026

అప్పులు ఇచ్చి … ఆపై ఆత్మహత్య

  • బాకీలు ఎవరు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్తాపం

నేటి సాక్షి, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన సాన శ్రీకాంత్ శుక్రవారం రోజు సాయంత్రం ఉరి వేసుకుని చనిపోయినట్లు జమ్మికుంట పట్టణ సిఐ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మడిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ కొంతకాలంగా పట్టణంలోని పాత మార్కెట్ వద్ద జీవనోపాధి నిమిత్తం పట్టణంలో నివసిస్తూ ఉండేవాడు. వృత్తిరీత్యా పట్టణంలో కొంతమందికి ఫైనాన్స్ ఇస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. ఈ మధ్యకాలంలో ఇచ్చిన బాకీలు ఎవరు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురైన సాన శ్రీకాంత్ పట్టణంలోని తన నివాసంలో ఫ్యానుకు ఉరివేసుకొని చనిపోవడం జరిగిందని జమ్మికుంట పట్టణ సీఐ తెలిపారు. అతనికి భార్య స్వాతి ఇద్దరు పిల్లలు ఉన్నారనీ, తన భార్య అయిన సాన స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News