- రంగ రంగ వైభవంగా అభయాంజనేయ స్వామి, నవగ్రహ, శిఖర, ధ్వజస్తంభ మహోత్సవ కార్యక్రమాలు
- పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు

నేటి సాక్షి, సైదాపూర్ : సైదాపూర్ మండలం లస్మన్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ, నవగ్రహ, శిఖర, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. గత మూడు రోజులుగా జరుగుతున్న వేడుకలు వేద మంత్రోచ్ఛారణల మధ్య గురువారంతో ముగిసాయి. ఆలయానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, వివిధ పార్టీల నాయకులకు, ఆడపడుచులకు, అతిథులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయం వద్ద నిర్వహించిన హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పండితులు రమణాచార్యుల బృందం ఆధ్వర్యంలో సోమవారం ప్రతిమామూర్తుల శోభాయాత్ర, విశ్వకేశ ఆరాధన, పుణ్యా వచనము, రక్షాబంధన, మృత్యు గ్రహణం, అంకురారోహణ, రుత్వికారోహణం నిర్వహించారు. మంగళవారం గోపూజ, యాగశాల, ప్రవేశం, ద్వారా తోరణా, ద్వజ కుంభారాధన, అగ్ని ప్రతిష్ట మూర్తి యంత్ర, మూలమంత్ర, జపహవనము, విశేష మన్యుసూక్తవనము, కండ దీపారాధన, ప్రతిష్టమూర్తుల కు పంచాంగస్య ప్రాశన, నిత్య పూర్ణాహుతి, బలిహరణం, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు రంగ రంగ వైభవంగా జరిగాయి. బుధవారం ద్వారా తోరణ, ధ్వజ కుంభారాధన, నిత్య హోమం, ప్రతిష్టమూర్తులకు పంచామృత అభిషేకం, వాస్తు పూజ, వాస్తుబలి, వాస్తు పర్యగ్రీకరణం, నిత్య పూర్ణాహుతి, బలిహరణ, ప్రసాద వితరణ ,సామూహిక సింధూర అర్చన, ధన,ధాన్యపల, పుష్ప యది వాసం, నిత్య పూర్ణాహుతి, బలిహరణం, కార్యక్రమాలు జరిగాయి. గురువారం రోజున గవంత పూజలు, గర్తా వ్యాసము, రత్నా వ్యాసము, శాతూవ్యాసము, పీఠ పూజలు, అభయాంజనేయ స్వామి విగ్రహ, ఆలయ శిఖర, ధ్వజస్తంభ, నవగ్రహ దేవతా యంత్ర ప్రాణ ప్రతిష్ట మహా పూర్ణాహుతి, కుంబాభిషేకం, గోధుష్టి, దివ్యదర్శనం, ప్రతిమారాధన ,అర్చన, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, అన్నప్రసాద తదితర కార్యక్రమాలు వైభవోపేతంగా నిర్వహించారు. దేవతామూర్తుల జలదివాస పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభయాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు, నాయకులు, మహిళలు, యువకులు, యువతులు, విద్యార్థులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



