కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలను అడవులనుండి దూరం చేసే కుట్ర
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) రాష్ట్ర అధ్యక్షులు భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు
నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి జూన్ 22
టైగర్ కంజర్వేషన్ పేరుతో ఆదివాసీలు సాగుచేస్తున్న భూముల నుండి, వారు నివసిస్తున్న ప్రాంతాలనుండి దూరం చేసి కార్పొరేట్ కంపెనీలకు అడవులను కట్టబెట్టేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు Go 49 తీసుకొచ్చాయని, GO 49 టైగర్ కారిడర్ ను రద్దు చేయాలనీ, పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని, పోడు పట్టాలకు బ్యాంక్ రుణాలు ఇవ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) రాష్ట్ర అధ్యక్షులు మాజీ భద్రాచలం ఎంపీ మిడియం బాబురావు
డిమాండ్ చేశారు
ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎదుట TAGS ఆధ్వర్యంలో GO 49 పత్రాలను దగ్ధం చేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
టైగర్ కంజర్వేషన్ కోసం ఎలాంటి గ్రామ సభలు జరుపకుండా, షెడ్యూల్ ప్రాంతం రాజ్యాంగ హక్కులను సైతం గౌరవించకుండా 300 పైగా గ్రామాలను ఖాళీ చేసేందుకు వారి ని భూముల నుండి వెళ్లగొట్టేందుకే ఈ జీవో అని మండి పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ దారిలోనే ఆదివాసీలను అడవులనుండి వెళ్లగొట్టే విధానం అమలు చేస్తుందని విమర్శించారు
కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ అటవీ విధానం షెడ్యూల్ ప్రాంతాల్లోని గ్రామ సభ పేసా షెడ్యూల్ హక్కులను కాలరాసి ఆ అటవీ లోని ఖనిజా సంపదలను పెట్టుబడి దారులకు, కార్పొరేట్ కంపెనీలకు అప్పాజెప్పెందుకు విధానం తీసుకొచ్చింది అందులో భాగంగా ఛత్తిస్ ఘడ్ ప్రాంతం లోని హస్ దే అటవీ ప్రాంతం లోని 4 లక్షల ఎకరాలను ఆదాని నికి అప్పాజెప్పింది దేశంలో అటవీ ప్రాంతం లోని ఆదివాసీలను అక్కడి నుండి వెళ్లగొట్టి టైగర్ కారిడర్ ల పేరుతో భూములను తీసుకొంటుంది దీనిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో గతంలో కవ్వాల్ టైగర్ జోన్ పేరుతో ఆదివాసీలను భూ నిర్వసితులను చేసి వారికి ఎలాంటి పరిహారం చెల్లించకుండా వారి కుటుంబాలను రోడ్డు మీదికి లాగరాని ఆరోపించారు
అలాగే గత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని దరఖాస్తులు వస్తే కేవలం 4 లక్షల ఎకరాల మాత్రమే పట్టాలు ఇచ్చింది ఇంకా 8 లక్షల ఎకరాల భూమి సాగు చేస్తున్న పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టో లో చెప్పిన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటుతున్న దాని జాడ లేదని తిరిగి పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారులతో దాడులు చేయించడం దుర్మార్గం అని తక్షణమే సాగులో ఉన్న పోడు సాగుదారులకి హక్కు పత్రాలు ఇవ్వాలని వారిపై అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతం లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక సౌకర్యాలు కల్పంచి ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్, ల్యాబ్ టెక్నీషన్, నర్సుల పోస్టులను భర్తీ చేయాలనీ డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమం లో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రవికుమార్, ఎర్మ పున్నం, కె శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆత్రం తనుష్, ఆత్రం కిష్టన్న, తొడసం శంబు, ఉయిక విష్ణు, వృత్తి దారుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ పైళ్ల ఆశయ్య, నాయకులు అశోక్, రాజన్న, దర్శనాల మల్లేష్, సంకె రవి, కుశన్న రాజన్న, లంకా రాఘవులు ,ముంజం ఆనంద్ కుమార్ నైతం రాజు, కొట్నాక్ సక్కు తదితరులు పాల్గొన్నారు

