నేటిసాక్షి, గన్నేరువరం, బుర్ర అంజయ్య గౌడ్ :
మంచిర్యాల జిల్లా లక్షక్ పేట్ లో నాలగవ, రాష్ట్ర స్థాయి డ్రాగన్ స్క్వాడ్ కుంగ్ ఫు అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో గన్నేరువరం మండల పరిధిలోని గుండ్లపల్లి స్టేజి వద్ద ఎస్ ఎల్ ఎన్ స్పార్కిల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్న ఇంటర్నేషనల్ షౌలినీ కుంగ్ బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన ముగ్గురు విద్యార్థులు ఏడవ తరగతి యు. నాగ శివ, మూడవ తరగతి కి చెందిన మోక్షిత, హరిప్రియ, లకు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని బంగారు పతకాలను వివిధ కేటగిరీలోని సాధించారు. బంగారు పతకాలను సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, పలువురు క్రీడా కారులు అభినందించారు. ప్రిన్సిపల్ అంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు ఆత్మ రక్షణకు కుంగ్ ఫు, జూడో, ఉష్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇప్పియడం జరుగుతుందని, ఇలాంటి శిక్షణ ఇవ్వడం వలన చదువుతోపాటు క్రీడల్లో కూడా ముందుంటున్నారని, రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో పాల్గొనే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, కరాటే విద్యార్థులు ఈ శిక్షణను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరస్పాండెంట్ ఈ సంపత్ , అకాడమిక్ డైరెక్టర్ పి సతీష్, కరాటే మాస్టర్ ఎలగందుల శ్రీనివాస్ ఉన్నారు.