నేటిసాక్షి, రాయికల్ ( సింగిడి కార్తీక్) : రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ రేకుర్తి కంటి హాస్పిటల్ వైద్యులచే నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 153 మందికి కంటి పరీక్షలు చేసారు. ఇందులో 36మందిని ఆపరేషన్ కోసం గుర్తించి రేకుర్తి కంటి హాస్పిటల్ కు వైద్యం కోసం తరలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు మాట్లాడుతూ రాయికల్ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు మారుముల గ్రామాల్లో విస్తరించాలన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 2036 మందికి కంటి ఆపరేషన్లతో పాటుగా మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అనంతరం శ్రీని ల్యాబ్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ నిర్ధారణ పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మచ్చ శేఖర్, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు మ్యాకల రమేష్, కొమ్ముల ఆది రెడ్డి, బత్తిని భూమయ్య, కాటిపల్లి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేష్, కోశాధికారి కట్ల నర్సయ్య, లయన్స్ క్లబ్ సభ్యులు బొడుగం అంజిరెడ్డి, కనపర్తి శ్రీనివాస్, మండలజు శ్రీనివాస్, బెక్కెం తిరుపతి, జిల్లాల సూర్యం రెడ్డి, వైద్యులు ప్రభాకర్, ల్యాబ్ టెక్నీషియన్ లు అందే రంజిత్,కటకం లవకుమార్, రాజేందర్, పంచాయతీ కార్యదర్శి రాజేష్, విడిసి అధ్యక్షులు నల్ల గంగారెడ్డి, నాయకులు కాటిపెళ్లి గంగారెడ్డి, కొల్లూరి వేణు తదితరులు పాల్గొన్నారు.





