Monday, March 23, 2026

ప్రభుత్వ ఎస్సి వర్గీకరణతో గోసంగి కులంకు అన్యాయం

నేటి సాక్షి, మెట్ పల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి వర్గీకరణ విధానం ద్వారా మమ్మల్ని మరింత వెనుకకు నెట్టి వేసి మాకు తీవ్ర అన్యాయాన్ని, ఆవేదనను మిగిల్చింది. అని గోసంగీ కుల రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల సాయి చరణ్ అన్నారు. బుధవారం రాష్ట్ర గోసంగి కుల సంఘం ఆధ్వర్యంలో మెట్ పల్లి పట్టణంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాల మాదిగ కులాల తరువాత అత్యంత జనాభా కలిగిన గోసంగీ కులాన్ని కేవలం 23.351 జనాభాగా చూపించడం చాలా బాధాకరం అని తెలిపారు.దళిత జాతి లో అత్యధిక జనాభా కలిగి విద్య ఉద్యోగ రాజకీయంగా ఎదిగిన మాదిగ సోదరుల మాలల తో ఉండలేక ఎస్సి వర్గీకరణ కోరుకున్నారు. మా గోసంగీ కులాన్ని మాల ఉప కులంగా చేర్చడం వల్ల తీవ్ర అన్యాయానికి గురి చేశారు.మా జనాభా ఆధారంగా మా వాటా ఇవ్వాలని సుప్రీం కోర్టు నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగ, రాజకీయ రంగాలలో మా స్థితిగతులను తీసుకొని మాకు లాభం చేకూర్చాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేష్, ఉపాధ్యక్షులు ఔషధం రవిందర్, కోశాధికారి అంకమల్ల రమేష్, అధికార ప్రతినిధి కలమడుగు తిరుపతి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు కుమ్మరి రామస్వామి, ప్రధాన కార్యదర్శి మాల్యాల శ్రీనివాస్, జిల్లా నాయకులు కలమడుగు రమేష్, శ్యామ్, లక్ష్మీ నారాయణ, కనకయ్య, నరేష్, అశోక్,విరస్వామి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News