Saturday, March 14, 2026

నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందజేయాలి

  • బిజెపి మండల అధ్యక్షులు కొప్పుల మహేష

నేటి సాక్షి, పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి) : అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వపథకాలు అందేల చూడాలని బీజేపీ మండల అధ్యక్షులు కొప్పుల మహేష్ అన్నారు. జూలపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయినా ఎ న్నికల సమయంలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. మహాలక్ష్మి పథకం పింఛన్ ల పెంపు కల్యాణ లక్ష్మి తులం బంగారం విద్యార్ధినులకు బండ్లు రేషన్ కార్డులు నివాస గృహములు రైతు బంధు రైతు రుణమాఫీ భూమి లేని కౌలు రైతులకు 15,000 రైతు కూలీలకు 12,000వంటి పథకాలు పార్టీలకు అతీతoగా నిరుపేద కుటుంబాలకు పూర్తి స్థాయిలో అందించాలని తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుడిపాటి సంతోష్ రెడ్డి, కంకణాల జ్యోతిబాస్, తానె అశోక్, నాడెం రాజన్న, బుసారపు రవీందర్, బొజ్జ సంపత్, గుమ్మడి శంకరయ్య , పెద్దోళ్ళ ఐలయ్య ,మల్లెత్తుల ఆంజనేయులు ,సంకెoడ్ల నర్సయ్య, లక్కకుల రమేష్, తీగల అశోక్, నల్ల గంగారెడ్డి, బడుగు శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు బండారి శ్రీకాంత్, చీమల రాజు, పొట్టల అశోక్, మెండే శ్రీకాంత్, నగునూరి సురేష్, అమరగాని సాగర్, గుంటి అశోక్,పెసరు మల్లేశం, నర్సింహా చారి, రాజు, వినయ్ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News