Saturday, March 14, 2026

అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

  • ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి కోసం పరిశ్రమలు ఏర్పాటు
  • పదేళ్లుగా రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వని వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి
  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో గురువారం జరిగిన ప్రజా పాలన గ్రామసభకు ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రజాపాలన గ్రామసభల్లో చదివిన జాబితాల్లో వివిధ పథకాల కింద పేర్లు రాని అర్హులు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అధికారులు దరఖాస్తులపై తక్షణమే విచారణ జరిపి వారిని ఎంపిక చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్ స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. గతంలో లాగ నాలుగు గోడల మధ్య లబ్ధిదారుల ఎంపిక చేయడం లేదని ప్రజా మధ్య వారి సమక్షంలో లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. గత పది సంవత్సరాలుగా ప్రజలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన బీఆర్ఎస్ సర్కార్ ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందించిన పాపాన పోలేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు దశల వారిగా సంక్షేమ పథకాలను అమలు చేస్తు ముందుకు పోతున్నామన్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12 వేలు వారి ఖాతాల్లో జమ, పంటలకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పెంపు వంటి సంక్షేమ పథకాలను ఈనెల 26 నుండి అందించడం జరుగుతుందని చెప్పారు. పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు.గతంలో ఎమ్మెల్యే కోటా కింద ,మంత్రుల కోటా కింద ఇండ్లు ఇచ్చారని కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3500 ఇండ్లు ప్రజా కోటా కింద పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.. ఏ సమస్యలు ఉన్నా వాటికి పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నామన్నారు. ముంపు గ్రామాల్లో 3600 పై చిలుకు ఉన్నా దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలిస్తుందని వాటిని త్వరలోనే శాశ్వత పరిష్కారం అవుతుందని చెప్పారు.. నూతన రేషన్ కార్డులు మంజూరు చేసినా తర్వాత సన్నం బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు.. ఇప్పటికే ప్రభుత్వం ఆనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అడ తల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల పెంపు,200 యూనిట్ల విద్యుత్ అందజేయడం జరుగుతుందన్నారు..
ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించడానికి మంత్రివర్యులు శ్రీధర్ బాబు తో ఇప్పటికే మాట్లాడటం జరిగిందని పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News