Tuesday, March 31, 2026

గిరిజన జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలి

  • టి డబ్ల్యూ జే ఏ రాష్ట్ర అధ్యక్షులు వెంకన్న నాయక్

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పాలకుర్తి లో సమావేశం నిర్వహించారు. టి డబ్ల్యూ జే ఏ జనగామ జిల్లా అధ్యక్షులు ధరావత్ అశోక్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు బానోతు వెంకన్న నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకన్న నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో పని చేస్తున్న గిరిజన జర్నలిస్టు లు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి శిక్షణ తరగతులు, ఐటిడిఎ తరుపున షరతులు లేకుండా లోన్లు మంజూరు ఇన్స్యూరెన్స్ లు స్వయం ఉపాధి కల్పించు కునేందుకు ప్రోత్సాహాలు తో పాటు మరిన్ని హక్కులు పొందే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ట్రైబల్ జర్నలిస్ట్ లు ముక్త కంఠంతో ఏకా తాటిపై ఉండి ముందుకు పోయే విధంగా కృషి చేస్తూ వారికి ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంఘం తరపున ఐడి కార్డు మంజూరు చేసేందుకు సభ్యత్వం తీసుకుంటున్నామని ప్రతి గిరిజన జర్నలిస్టులు సభ్యత్వం తీసుకోవాలని కోరారు. అతి త్వరలో రాష్ట్ర స్థాయి మీటింగ్ ఏర్పాటు నిర్వహించ బోతున్నమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ సభ్యులు లావుడియ రాజు నాయక్ జనగామ జిల్లా టీడబ్ల్యూజేఏ అధ్యక్షులు రిపోర్టర్లు అశోక్ నాయక్, దేవోజీ నాయక్, శ్రీను నాయక్, నాయక్, సుమన్ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News