
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : ఇటీవల దావోస్ పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని తెలంగాణ రాష్ట్రానికి దావోస్ వేదికగా రూ. 1.78 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించినందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను మంగళవారం హైదరాబాద్ లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కలిసి ధన్యవాదాలు తెలపడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనీ తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం, నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉన్న కారణంగా ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని అన్నారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చర్చించారు.





