Tuesday, March 24, 2026

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ అడ్లురి

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ )
ఎమ్మెల్సీ ఓటింగు సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ కలిసి వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కార్యకర్తలు కేంద్రం వద్దనే ఉండాలని ఓటు వేయడానికి వచ్చే ఓట్లరకు ఓటింగు విధానం పైన అవగాహన కల్పించాలని,దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను వాహనాల సౌకర్యం ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలించి ఓటు హక్కును వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని,పోలింగ్ సమయం పూర్తి అయ్యే వరకు ఎవరూ పోలింగ్ కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదని సూచించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News