Tuesday, March 24, 2026

ఎల్ ఓ సి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్

నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): చందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన యం లక్ష్మి అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశిస్తూ మరియు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 3,00,000/- రూపాయలు మంజూరు చేపించారు. అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News