Monday, March 30, 2026

జిపి అనుమతులు నిల్

  • డెవలప్మెంట్ పేరుతో వెలిసిన వెంచర్
  • పర్మిషన్ లేకున్నా పక్కాగా పనుల నిర్వహణ
  • జి పి అనుమతి లేదని తెలిపిన కార్యదర్శి

నేటి సాక్షి, రామడుగు (పురాణం సంపత్): జిపి అనుమతులు లేకున్నా ఇష్టానుసారంగా డెవలప్మెంట్ పేరుతో పనులు చేస్తూ అమాయక ప్రజలను అక్రమ దారి తొక్కిస్తున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు… వివరాల్లోకి వెళితే రామడుగు మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో సర్వే నంబర్ 63,64లో ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి రాత్రిళ్ళు గ్రామాలలో ప్రజలు నిద్రపోకుండా ఇష్టానుసారంగా అనుమతి లేకుండా అక్రమ మట్టిని తరలిస్తూ డెవలప్మెంట్ పేరుతో అంతర్గత రోడ్లు డ్రైనేజీలను నిర్మించి గ్రామపంచాయతీ పర్మిషన్ పత్రం లేకున్నా డెవలప్మెంట్ చేస్తున్నామని ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి అరచేతిలో స్వర్గాన్ని చూపుతూ అమాయక ప్రజలే ఆసరాగా చేసుకుంటున్నారు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. నిబంధనల ప్రకారం లేఅవుట్ చేసిన స్థలంలో గ్రామపంచాయతీకి 10% రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. మరి దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా గ్రామపంచాయతీకి 10 శాతం రిజిస్ట్రేషన్ చేశారని గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అనుమతి పత్రం కోసం ఆన్లైన్లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల తీసుకోవడం లేదని బదులు ఇచ్చారు.అంటే దాని అర్థం పరిమిషన్ పత్రం లేదని చెప్పకనే చెప్పారు. ఇంత తతంగం జరుగుతున్న సంబంధిత అధికారులు నోరు మెదపకపోవడం పట్ల గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇట్టి విషయంపై శుక్రవారం సంబంధిత అధికారులు వెంచర్ వద్దకు వచ్చి పరిశీలించి వెళ్ళారే తప్ప ఇటువంటి చర్యలు చేపట్టడం లేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.ఒక గ్రామంలో వెంచర్ వెలిసిందంటే గ్రామపంచాయతీ పర్మిషన్ తప్పనిసరి కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా గ్రామపంచాయతీ పర్మిషన్ పత్రం రాకున్నా ఇష్టానుసారంగా ప్లెక్సీలు పెట్టి అమాయక ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని గ్రామస్తులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.మరి ఇప్పటికైనా అధికారులు ఇట్టి ప్రైవేట్ వెంచర్ పై దృష్టి సారించి సంబంధిత శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News