ప్రతి ఓటరును ఇంటి,ఇంటికి వెల్లి కలవాలి
నిరంతరం సమీక్ష, సమన్వయంతో పని చేయండి.
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్.

నేటి సాక్షి, జమ్మికుంట
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని,దానికి కో-ఆర్డినేటర్ లు సమిష్టిగా,సమన్వయంతో పని చేయాలని పరకాల ఎమ్మేల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు.హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో ఇళ్ళందకుంట,జమ్మికుంట మండల కో-ఆర్డినేటర్ ల సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టభద్రుల హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి పరకాల ఎమ్మేల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరును నేరుగా ఇంటికి వెళ్లి కలవాలని,పట్టభద్రుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని,పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో నరేందేర్ రెడ్డి గట్టిగా కొట్లాడతారని అన్నారు.ప్రచారం చేసే సమయంలో వారి సమస్యలు తెలుసుకోవాలని,వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.





