Monday, March 23, 2026

మండలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

నేటి సాక్షి, బెజ్జంకి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మండలంలోని గూడెం మరియు వడ్లూరు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉట్కూరు నరేందర్ రెడ్డి కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ అభ్యర్థికి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల‌ని పార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు గూడలి శ్రీకాంత్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కొమురయ్య, డైరెక్టర్ పులి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో ప్రచారాన్ని మరింత బలోపేతం చేసేందుకు గ్రామ శాఖ అధ్యక్షులు మంద శేఖర్, బోనాల ఐలయ్య, నాయకులు బైరా సంతోష్, పులి రమేష్, బెజ్జంకి అనిల్, జెల్ల నిఖిల్, వేణు, రాము, ప్రభాకర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News