నేటిసాక్షి :కొడిమ్యాల
కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం మల్యాల తహసీల్దార్ మునిందర్ ఇంచార్జ్ గా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై 11 గంటల వరకు 100 ఓట్లు పైచిలుకు వేశారు. మధ్యాహ్నం 12 తర్వాత ఓటర్లు క్యూ లైన్ లో బార్లు తీరారు. ఈ ఓటింగ్ స్థానిక ఓట్లను తలపించేలా ఉంది ఎప్పుడు ఎమ్మెల్సీ ఓట్లు జరిగిన కూడా గ్రామాలలో ప్రజలకు అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం స్థానిక ఎలక్షన్లు కంటే ఎక్కువ స్థాయిలో ప్రచారం నిర్వహించారు. కొడిమ్యాల మండల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ల ఓట్లు మొత్తం .2122.ఉండగా పోలైన ఓట్లు -1464 ఉండగా పురుషులు 869 స్త్రీలు 595 ఓట్లు వేయగా ఉపాధ్యాయుల ఓట్లు 35 ఉండగా పురుషులు 26 స్త్రీలు 9 వేయగా మొత్తం 68.9% పోలింగ్ శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా సాయంత్రం 4.గంటలకు ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది




