నేటి సాక్షి, కాప్ర : ఏఎస్ రావు నగర్ లోని భాష్యం స్కూల్ లో యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీడియాట్రిషన్ డాక్టర్ ఇందుమతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యత, విద్యార్థుల ఆరోగ్యం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. చిన్న పిల్లలు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులకు టోపీలు, గౌనులు ధరింప చేశారు. భాష్యం స్కూల్స్ జోనల్ ఇంచార్జ్ మార్కండేయులు, ప్రిన్సిపల్ అమరేశ్వర రావు, అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ వనిత మేరీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.





