Monday, March 30, 2026

బకాయి వేతనాల గురించి గ్రామపంచాయతీ సిబ్బంది నిరసన

  • గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్

నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు గ్రామపంచాయతీ సిబ్బంది బకాయి వేతనాల గురించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా డిమాండ్లలో భాగంగా హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు నెలలో ఒకటో తారీకు నుంచి ఐదో తారీకు వరకు జీతాలు అకౌంట్లో వేస్తామని మాట ఇచ్చి ఇప్పుడు తప్పుతున్నారని ఇది సబబు కాదని అంతేకాకుండా పిఆర్సి వర్తింపజేసి 26 వేల నెల జీతం ఇవ్వాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని పలు రకాల డిమాండ్లు చేశారు. జనవరి ఒకటి 2025 నుండి జీతాలు క్రమం తప్పకుండా వస్తాయని హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు మూడు నెలల నుంచి ఎలాంటి జీతాలు అందలేదని గ్రామపంచాయతీ కార్మికులు వాపోయారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ సిబ్బంది కార్మికుల గురించి ఆలోచించి పిఆర్సి ప్రకారం వేతనాలు చెల్లించాలని,బకాయి వేతనాలు వచ్చేలా చూడాలని కార్మికులు వేడుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో మండల గ్రామ పంచాయతీ యూనియన్ అధ్యక్షులు ఇసంపల్లి ఐలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు మాట్ల భాస్కర్, గ్రామపంచాయతీ సిబ్బంది శనిగరపు పురుషోత్తం, వెంగళ లక్ష్మణ్, బుర్రి కుమార స్వామి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News