- ప్రజలు ప్రశ్నించడంతో వెనుతిరిగిన అధికారులు
- గోపాల్రావుపేటలో రసభసగా గ్రామసభ
- ఇష్టానుసారంగా లిస్టు తయారు చేశారని గ్రామస్తులు ఆగ్రహం

నేటి సాక్షి రామడుగు (పురాణం సంపత్) : గ్రామంలో నిర్వహించిన గ్రామసభ గందరగోళంగా మారింది. అసలైన అర్హులకు కాకుండా ఏ విధంగా సర్వే చేసి లిస్ట్ ఫైనల్ చేశారో అని ప్రజలు ప్రశ్నించడంతో అధికారులు అయోమయానికి గురయ్యారు. రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట గ్రామంలో బుధవారం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల కొరకు అధికారులు గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా లబ్ధిదారుల లిస్టు చదువుతుండగా గ్రామ సభకు వచ్చిన ప్రజలు అసలైన అర్హులకు కాకుండా ఇష్టానుసారంగా లిస్టును తయారు అన్నీ ఉన్న వారికే ప్రభుత్వ ఫలాలు ఏ విధంగా ఇస్తారని యువకులు,మహిళలు ప్రశ్నించడంతో అధికారులు అయోమయానికి గురయ్యారు. అధికారులు ఏం సమాధానం చెప్పక మెల్లగా జారుకున్నారు. దీంతో గ్రామసభ కాస్త గందరగోళంగా మారింది.





