- రేపటి నుంచి 23 వరకు లబ్ధిదారుల ఎంపికకు కృషి చేయాలి
- ప్రతీ పేదవాడికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు: కేఎల్ఆర్
నేటిసాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసాకు అర్హులను గుర్తించేందుకు (రేపు) 21 నుంచి 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా గ్రామసభలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించనున్నట్లు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన లిస్టుల్లో పేర్లు లేకున్నా మరోసారి గ్రామసభలో దరఖాస్తులు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న . నియోజకవర్గ అధికారులు, పార్టీ నేతలతో చర్చించారు. అర్హులకు అన్యాయం జరగకుండా అనర్హులను ఏరివేసేలా కాంగ్రెస్ సేన అధికారులకు సహకరించాలని కోరారు. మహేశ్వరం, కందుకూరు, తుక్కుగూడ, జల్ పల్లి, బడంగ్ పేట, మీర్పేట్, ఆర్కేపురం, సరూర్ నగర్ మండల, డివిజన్ ల్లో కాంగ్రెస్ నాయకులు రేపటి నుంచి జరిగే గ్రామ సభలకు అన్ని ఏర్పాట్లు చేసి అధికార యంత్రాంగానికి అందుబాటులో ఉండాలని కిచ్చెన్నగారు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు కళ్లు లాంటివన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ లో అనేక పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుని దావోస్ చేరుకున్నారని కేఎల్ఆర్ తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక (పెట్టుబడులు) సదస్సు ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరగనుందని లక్ష్మారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫోర్త్ సిటీ, స్కిల్ యూనివర్శిటీలో పెట్టుబడులకు అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారని గుర్తు చేశారు.




