హన్మకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు)
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు నిర్వహించే గ్రామ సభలు జవాబు దారీతనంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో మండల స్థాయి ఆఫీసర్స్ (పంచాయతీ సెక్రెటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్ తో నిర్వహించిన అవగాహన సదస్సు, శిక్షణ కార్యక్రమం, గ్రామస్థాయి బృందాలు మరియు క్లస్టర్ స్థాయి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ఈనెల 21 నుంచి 25 వరకు నిర్వహించే గ్రామసభలు ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై నిర్దేశించిన భూములను, మైనింగ్ భూములను వివరాలు ఖచ్చితంగా సేకరించాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల వివరాలు సూచించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి సేకరించిన వివరాలను గ్రామ పంచాయతీ నోటీసు బోర్డుపై వివరాలు ఉంచి అభ్యంతరాలను స్వీకరించాలని, సేకరించిన వివరాలను మండల స్థాయి అధికారులకు తెలియజేయాలన్నారులే..అవుట్ మినహా, పడావున్న భూములను కూడా రైతు భరోసా పథకానికి అర్హులుగా గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఆదాయ వివరాలను సేకరించి అర్హులైన రేషన్ కార్డుల జాబితాలు లబ్ధిదారులు మధ్య దళారులను ఆశ్రయించకుండా సరియైన రీతిలో అర్హులైన వారి జాబితాలు గ్రామ సభలో ప్రజలకు నివేదించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామ సభలకు ముందే ఒకరోజు ప్రజలను వచ్చి అభ్యంతరాలను సేకరించి, ఉన్నతాధికారుల సలహా మేరకు తుది జాబితాను తయారుచేసి గ్రామ సభలలో జాబితాను ప్రదర్శించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామ సభలలో స్థానిక లబ్ధిదారుల తో పాటు గ్రామస్థాయి ఇందిరమ్మ కమిటీలను కూడా ఆహ్వానించాలని కలెక్టర్ సూచించారు. పెండింగ్ సర్వేలు ఉన్న యెడల రేపటి లోగా పూర్తి చేయాలని సేకరించిన డేటాను పూర్తి స్థాయిలో భద్రంగా ఉంచి కంప్యూటర్ రీజన్ చేయాలని కలెక్టర్ తెలిపారు. గ్రామస్థాయి కమిటీలు, సబ్ కమిటీలు వారికి నిర్దేశించిన విధంగా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో కె. నారాయణ, తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఏవో శ్రీనివాస్, ఎం పి ఓ. విమల, గ్రామపంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ అధికారులు ఏఈఓ లు, ఏఈవోలు, ఆర్ ఐ లు, తదితరులు పాల్గొన్నారు.





