Thursday, March 26, 2026

ఘనంగా పారువేట ఉత్సవం

  • రాయచోటి పట్టణ పురవీధుల్లో ఊరేగిన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి

నేటి సాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నుంచి గాంధీ బజార్, కంసల వీధి, నాలుగు రోడ్ల టానా కూడలి, పాత రవి హాల్ వీధిలలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి అంగరంగ వైభవంగా ఊరేగాడు. పారువేట ఉత్సవం మండపం నందు స్వామివారికి పూజలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈ ఓ వెంకటరమణారెడ్డి, కోలాటం మాస్టర్ తుమ్మల హరినాథ్, మల్లి స్వామి, అర్చకులు శంకర స్వామి యోగి స్వామి కృష్ణయ్య స్వామి దేవస్థానం సిబ్బంది తొ పాటు కన్నడభక్తులు, హిందూ సంస్థలు బజరంగ్ ధళ్, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ నాయకులు, బిజెపి నాయకులు, భజన బృందం కళాకారులు, పెద్ద ఎత్తున స్వామి ఊరేగింపులో పారువేట కార్యక్రమంలో మహిళలు భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలు, బ్యాండు మేలాలు, డ్రమ్స్ శబ్దాల నడుమ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కోలాటం చెక్కభజనలు భక్తులను ఆకట్టుకున్నవి. భక్తులకు తీపి ప్రసాదాలు, అన్నదాన వితరణ చేశారు. పటిష్ట బందోబస్తును జిల్లా కలెక్టరు, ఎస్పీ ఆదేశం మేరకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News