
నేటి సాక్షి,మెట్ పల్లి : పట్టణంలోని అక్షర హైస్కూల్లో భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్ ప్రారంభోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులు క్రమశిక్షణతో,నీతి నిజాయితీతో మరియు విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని కోరారు.ఈ కార్యక్రమంలో మరో అతిథి ఎంఇఓ చంద్రశేఖర రావు మాట్లాడుతూ..భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్ ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయమని అందరు విద్యార్థిని విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు.కరస్పాండెంట్ కొత్తూరు శ్రీనివాస్ మాట్లాడుతూ..డివిజన్ స్థాయిలో స్కౌట్స్ మరియు గైడ్స్ ప్రారంభించిన మొదటి పాఠశాలగా నిలిచిందన్నారు.ప్రతి విద్యార్థిని,విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ లో సభ్యత్వం తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై కిరణ్ కుమార్,జిల్లా స్కౌట్ అధికారులు మధుసూదన్,వినోద్,తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు,మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




