నేటిసాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : వీరబల్లి మండలకేంద్రంలోని వొంగిమల్ల గ్రామంలోని పోలు చెన్నారెడ్డిగారి పల్లెలో శనివారం కుంకుమ బండి వద్ద గంగమ్మ తల్లి బోనాల కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. ఊరిలోని మహిళలు ఇంటికో బోనం నెత్తిన ఎత్తుకొని డప్పులు, బాణాసంచా కాలుస్తూ ఊరేగింపుగా కుంకుమ బండి వద్దకు చేరుకున్నారు. అక్కడ మహిళలు కుంకుమ బండిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి బోనాలు సమర్పించి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి పంటలు బాగ పండాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో విఆర్డియెస్ సురేంద్రారెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




