నేటి సాక్షి ప్రతినిధి, బెజ్జంకి : బెజ్జంకి మండల కేంద్రంలోని గీతాశ్రమ పాఠశాలలో 2001-02లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం బెజ్జంకి లయన్స్ భవన్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఇప్పుడు ఉంటున్న ప్రాంతాలు, కుటుంబాల గురించి మాట్లాడుకుని ఆటాపాటలతో సందడిగా గడిపారు. పాఠశాల కరస్పాండెంట్ నారెడ్డి సుదర్శన్‌రెడ్డి, ఉపాధ్యాయులు చీపురుశెట్టి మోహన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 2001-02 బ్యాచ్ విద్యార్థులు పాల్గొన్నారు.