Saturday, March 14, 2026

భలే ఐడియా! గురూ

  • కొండముచ్చు ఫోటోతో కోతుల బెడదకు చెక్
  • భూపతిపూర్ ఆలయంలో నిర్వహకుల ఐడియా

నేటిసాక్షి, రాయికల్: కోతుల బెడద వల్ల ఆలయానికి భక్తుల తాకిడి తగ్గింది. ఆలయానికి వచ్చే భక్తుల బ్యాగులు, టెంకాలు, పండ్లు కోతుల బారిన పడటం, భక్తులపై దాడికి తెగబడటంతో నిర్వహకులు కోతుల బాధ నుండి విముక్తి కలిగించేందుకు గొప్ప ఉపాయం పన్నారు. కొండ ముచ్చు అంటే కోతులకు భయం ఇదే అదనుగా భావించిన ఆలయ కమిటీ చైర్మన్ సంకోజి మహేష్, అర్చకులు వంశీకృష్టాలు ఆలోచించి కొండముచ్చు పోటోతో ఫ్లెక్షి ఏర్పాటు చేసారు. ఈ ఐడియా బాగ పనిచేసింది. దాంతో ఆలయానికి కోతులు రావడం తగ్గంది. భక్తుల తాకిడి పెరిగింది. అందరు భలే ఐడియా గురూజీ అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News