నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం:
రంగారెడ్డి జిల్లా ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం
తెలంగాణ అసైన్డ్ భూమి సమితి రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిక్కిరి శ్రీకాంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభంసందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు. మహనీయుడైన మహమ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన మాసం రంజాన్. పవిత్ర గంధం ఖురాన్‌ను ప్రార్థిస్తూ అల్లాస్ నిర్దేశించిన సత్యమార్గాన్ని అనుసరించే ముస్లింలు రంజాన్ మాసంలోప్రతిరోజు ఎంతో నిష్టగా అత్యంత కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు. రంజాన్. మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను. క్రమశిక్షణ,దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత. సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకోవడం సంతోషకరం. అల్లా కృపతో విజయవంతంగా ఉపవాస దీక్షలను ఆచరించాలని కోరుకుంటున్నాను.




