Wednesday, January 21, 2026

గుండోడుకణం రోడ్డుకు భూమి పూజ

  • కొత్త కండ్రిగ పంచాయితీ విచ్చేసిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు
  • ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
  • గుండోడుకణం రోడ్డు అభివృద్ధికి 22 అడుగుల వెడల్పు సుమారు రూ. లు 3 కోట్ల 15 లక్షలు ఎన్.ఆర్.జి.ఎస్ నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
  • హిటాచి వాహనాన్ని ఎక్కి పనుల ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని

నేటి సాక్షి ప్రతినిధి, రామచంద్రాపురం : మండలంలోని కొత్త కండ్రిగ గణేషపురం పంచాయతీల పరిధిలో ఉన్న గుండోడు కణం రోడ్డు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఘన స్వాగతం పలికిన అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు. రోడ్డుకు భూమి పూజ చేసి శంకుస్ధాపన చేసిన తర్వాత జెసిబి తో పనులు ప్రారంభించారు. రోడ్డు అభివృద్ధికి సుమారు 3 కోట్ల 15 లక్షలు రూ.లు. ఎన్.ఆర్.జి.ఎస్ నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. గుండోడుకణం రోడ్డు కొత్త నెన్నూరు నుండి టీ.టీ. కండ్రిక వరకు 22 అడుగుల రోడ్డు అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో పూర్వీకులు కర్వేటి నగరం రాజులు గుండోడుకణం రోడ్డు మీదుగా తిరుమలకు వెళ్లే వారని ఎమ్మెల్యే తెలిపారు. గుండోడుకణం రోడ్డు వేస్తే సుమారు 30 గ్రామాల ప్రజలు తిరుపతికి వెళ్లడానికి సుమారు 7 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. గత వైసిపి ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్దికి నోచుకోని గుండోడుకణం రోడ్డు ఎన్నికల సమయంలో రోడ్డు సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఎన్నికల సమయంలో ప్రజలకు గుండోడుకణం రోడ్డు అభివృద్ది చేస్తానని ఆనాడే వాగ్దానం చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే పులివర్తి నానికి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మేకల తిరుమల రెడ్డి మాజీ ఎంపిపి తానికొండ కేశవులు నాయుడు, నాయకులు చేకూరి జనార్థన్ చౌదరి, చిన్న బాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఈ ఉమాపతి నాయుడు కొట్టే నరసింహా రెడ్డి కోరా హరిప్రసాద్, నీలకంఠ చౌదరి, నాయకులు మాదవయ్య, ధనుంజయ రాయ‌‌‌లు, లెక్కల మహేష్ నాయుడు, లెక్కల సురేంద్ర నాయుడు, కొల్లంగుంట ముని రామిరెడ్డి కొట్టే గిరిధర్ రెడ్డి, కొట్టే ధనుంజయ రెడ్డి,రెడ్డెప్ప, సుకుమార్ నాయుడు, మురళి నాయుడు, మధు, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు జనార్థన్ చౌదరి, తాసిల్దార్ వెంకట రమణ, ఎంపిడిఓ ఇందిర, గ్రామ కార్యదర్శి లు చిరంజీవి, హరిత, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News