Friday, March 13, 2026

సూర్యాపేట జిల్లా సమాచార హక్కు చట్టం యాక్టివేషన్ సొసైటీ అధ్యక్షుడిగా గుగులోతు నరేష్

నేటి సాక్షి, కోదాడ, ప్రతినిధి: సూర్యాపేట జిల్లా సమాచార హక్కు చట్టం యాక్టివిస్ట్ సొసైటీ అధ్యక్షునిగా సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని యసంతాపురం ఆవాస గ్రామమైన తెల్లబండ తండ వాసి గుగులోతు నరేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షుడు గుగులోతు నరేష్ మాట్లాడుతూ… సామాజిక కార్యకర్తగా చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి జిల్లా అధ్యక్షునిగా తనకు బాధ్యతను అప్పగించిన సమాచారకు చట్టం యాక్టివిటీ సొసైటీ వ్యవస్థాపకులు అధ్యక్షులు అయిన పటోళ్ల ప్రవీణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న సంస్థల నందు సమాచార హక్కు చట్టం అవకశతను తెలియజేసి మున్ముందు భవిష్యత్తులో నిజాయితీగా నిబద్దతతో సొసైటీ ని నడిపిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో సొసైటీ నియామకాలు జరుగుతున్నాయని ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News