Sunday, March 22, 2026

గల్ఫ్ కార్మికుడు ఆపన్నస్తం కోసం ఎదురు చూపు

నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): మండల కేంద్రానికి చెందిన రంగనవేణి కనుకయ్య ముదిరాజ్ బతుకుదేరువు కోసం సౌది అరేబియా కు వలస వెళ్ళాడు, కనకయ్య ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కాలుజారి కింద పడడంతో రెండు కాళ్లు విరిగాయి. అనంతరం ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో ఆరు వేల, రూపాయలు అ కుటుంబానికి అందజేశారు. రంగనవేణి కనుకయ్య ఇండియాకు రావడానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతాయిని అ కుటుంబం నికి ఎవరైనా దాతలు ఉంటే 7075513466, 7093773073 లకు ఫోన్ పే నంబర్లకు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కనకయ్యకు ఒక కూతురు భార్య ఉన్నారు. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి, భార్య కూలి పని చేసుకుంటూ జీవిస్తుంది. కూతురికి పెళ్లి చేసి జీవన ఉపాధి కోసం కనకయ్య గల్ఫ్ కు వెళ్లాడు, ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి కింద పడడంతో ఆ కుటుంబం రోడ్డున పడడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం మరియు దాతలు స్పందించాలని గల్ఫ్ కార్మికుల సంఘం నాయకులు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమం లో కుంభం మహేష్, బోయిని సంతోష్, రంగనావేణి శ్రీను, బోయిని చంద్రం, బోయిని మల్లేశం పాకాల పర్శరామలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News