- ఎన్ టి ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్ డిమాండ్
నేటి సాక్షి, జమ్మికుంట
తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సొంత భవనాల నిర్మాణం చేపట్టాలని ఎన్ టి ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలో విలేకరుల సమావేశంలో నవ తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం పూర్తి అయిన ఇప్పటివరకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సొంత భవనాల నిర్మాణం చేపట్టకపోవడం ప్రభుత్వం వైఫల్యం అని, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ముసలి కన్నీరు కారుస్తూ పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ వారి జీవితాలను తుంగలో తొక్కుతూ రేపటి తరానికి విద్యార్థులకు విద్యను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దానికి నిదర్శనమే ఈ సంవత్సరకాలంలో విద్యారంగా సమస్యల పైన గాని పెండింగ్ లో ఉన్న అద్దె భవనాల బకాయిల చెల్లింపుల గురించి గానీ నూతన భవన నిర్మాణాల గురించి గానీ అసెంబ్లీలో ప్రస్తావించకపోవడం కారణమని కొని ఆడారు. ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల గాని విద్యారంగం పైన గాని చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా సొంత భవనాలను నిర్మించి రేపటి తరానికి విద్య రంగాన్ని గొప్ప స్థాయిలో చూపించాలని హెచ్చరించారు. ఇకనైనా సొంత భవనాల నిర్మాణం చేపట్టకపోతే రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.

