Tuesday, March 31, 2026

హాల్, హ్యాపీ హోమ్స్ గదులను అందుబాటులోకి తీసుకురావాలి

నేటి సాక్షి, మందమర్రి:- పట్టణంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హాల్, హ్యాపీ హోం గదులను ప్రజలకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకురావాలని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ కోరారు. ఈ మేరకు ప్రజావాణి కార్యక్రమంలో మండల తహశీల్దార్ పి సతీష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని మండల తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న హాల్ గత ఎనిమిది సంవత్సరాల నుండి ప్రభుత్వ ఆధీనంలో నిరుపయోగంగా ఉందని, అదే విధంగా స్థానిక పోలీస్ స్టేషన్ పక్కన హ్యాపీ హోమ్స్ పేరిట నిర్మితమైన గదులు సైతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు. ఈ రెండింటిని ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి పట్టణ అధ్యక్షుడు గాజుల శంకర్, మండల అధ్యక్షుడు ఎండి మతిన్ ఖాన్, నాయకులు ఐలోని రాజు, ప్రజా సంఘాల నాయకుడు రామసాని శేఖర్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News