- సర్పంచ్ గోవిందయ్య
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : వేసవికాలంలో త్రాగునీరు కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా చేతి బోర్లను ఏర్పాటు చేస్తున్నానని బొమ్మయపల్లి సర్పంచ్ గోవిందయ్య తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలతో బొమ్మలపల్లి పంచాయతీలో సుమారు 13 చేతి బోర్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. వేసవికాలంలో త్రాగునీరు బోర్లు కు విద్యుత్తు అంతరాయం కలిగినప్పుడు ప్రజలు తాగునీటి కోసం పంచాయతీ ప్రజలు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ త్రాగునీటి రక్షిత మంచినీటి సరఫరా విధానంతో పాటు ప్రతి ఇంట్లో టాయిలెట్ తప్పని సరి అన్నారు. అదేవిధంగా పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఆరోగ్యం గా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ప్రజలకు ఏ అవసరమొచ్చిన అందుబాటులో ఉంటానని సర్పంచి గోవిందయ్య అన్నారు.





