- ఘనంగా కొమ్మూరి జన్మదిన వేడుకలు

నేటి సాక్షి చేర్యాల : చేర్యాల పట్టణంలో అంగడి బజార్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన జనగామ డిసిసి అధ్యక్షులు & జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు భారీ ఎత్తున జరిగాయి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను చేసుకోవడం జరిగింది. మరియు దుస్తులు పంపిణీ చేయడం. తర్వాత అన్నదానం కార్యక్రమం జరిగింది అభిమానులు భారీ సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి చేర్యాల మండల అధ్యక్షులు కొమ్ము రవి పట్టణ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంజ మల్లేశం జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్మా ఆగంరెడ్డి యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ సోషల్ మీడియా వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొని విజయవంతం చేశారు. చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా వేలాది సంఖ్యలో వచ్చిన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపి అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

