Saturday, March 21, 2026

హర హర మహాదేవ..! శంభో శంకర..!!

  • శ్రీ భవానీ శంభులింగేశ్వర స్వామి జాతర మహోత్సవానికి రూ. 50 వేల విరాళం

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి ( కోక్కుల వంశీ ) : మహా శివరాత్రి పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలోని శ్రీ భవాని శంభులింగేశ్వర స్వామి జాతరతో పాటు ఈ నెల27న అన్నదానం కార్యక్రమనికి మానాల తుక్య నాయక్ తండా కు చెందిన గుగులోత్ కిస్టు నాయక్ యశోద గార్ల తనయుడు గుగులోత్ రఘుపతి నాయక్ ప్రియాంక లు రానున్న శ్రీ భవానీ శంభులింగేశ్వర స్వామి వారి జాతర మహోత్సవానికి 50.001/- రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా శ్రీ భవాని శంభులింగేశ్వర స్వామి ఆలయకమిటీ సభ్యులు గుగులోత్ రఘుపతిని శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వైస్ చేర్మన్లు కొండ రాజేందర్ పిసరీ భూమయ్య, తుమ్ జలపతి, జక్కు మోహన్ గ్రామస్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News