Tuesday, March 24, 2026

హరహర మహదేవ శంభో శంకర.!

  • భక్తుల పెన్నిధి..! శ్రీ శంభులింగేశ్వర సన్నిధి
  • మహాశివరాత్రికి ముస్తాబైన ఆలయం
  • ఉపవాస దీక్షలు, జాగారానికి సిద్ధమైన భక్తులు
  • ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు
  • ఈ ఏడాది పెరగనున్న భక్తుల రద్దీ

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి ( కోక్కుల వంశీ ) : లయకారుడు.. గరళ కంఠేశ్వరుడు.. ప్రళయ రుద్రుడు.. శివుడు..! ఓం నమః శివాయ అనే మంత్రం సృష్టికి మూలాధారం.. లోకకల్యాణానికి ఆధారం.. నాగ భూషణుడి దయలేనిది మనుగడ లేదు.. శరణం అంటే చాలు అభయమిచ్చే బోళా శంకరుడు., శివయ్యను నిండార కొలుచుకునే పండుగే మహాశివరాత్రి.. బుధవారం రుద్రంగి మండలకేంద్రంతో పాటు ఉమ్మడి మానాల శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగనున్నాయి.. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలతో స్తుతించేందుకు భక్తజనం సన్నద్ధమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలోని శ్రీ భవాని శంభులింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని అర్చకులు ప్రత్యేక పూజలు చేయనున్నారు.

  • ఆలయ చరిత్ర..-

శ్రీ భవానిశంభులింగేశ్వర దేవాలయం రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లోని మానాల గ్రామంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అతిపురతన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం చాలా పురాతనమైనది. సంవత్సరాల క్రితం అని గ్రామస్తులు తెలుపుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పదకొండు ఏళ్ల క్రితం గ్రామస్తులు అందరూ కలిసి నూతన ఆలయాన్ని సుమారు 1కోటి నుంచి కోటి 8లక్షల రూపాయల వరకు నిర్మాణం చేపట్టారు. ప్రతి ఏటా సుమారుగా 20 నుంచి 25 క్వింటాల మాహా అన్నదానం కార్యక్రమం చేపడతారు. చుట్టుపక్కల ఉన్న గిరిజన తండాలతో పాటు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి శివరాత్రి రోజు స్వామి వారిని దర్శించుకుంటారు.

  • శివరాత్రి వేళా భక్తుల జాగరణ..

మహా శివరాత్రి ఎంతో పర్వదినం అయిన రోజు, ఈ రోజు జాగరణ చేస్తే ఎంతో మంచిదంటారు పండితులు, శివరాత్రి రోజు శివుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. అయితే శివరాత్రి నాడు ప్రతి ఒక్కరు జాగరణ ఉండాలని అంటారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఆలయమునకు వచ్చిన భక్తులు రోజంతా భక్తిశ్రద్ధలతో పూజించి, శివభక్తులు మహా శివరాత్రి రోజున శివయ్యను స్మరించుకోవడం వల్ల తాము శాంతిని, ప్రశాంతతను పొందుతారని వేదపండితులు తెలిపారు. శివరాత్రి రోజు ఉపవాసం గా ఉండి రాత్రి వేళల్లో శివనామస్మరణతో జపిస్తూ మరుసటి రోజు స్నానమాచరించి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఆలయంలో జరిగే అన్నదానం స్వీకరించి భక్తులు తిరుగు ప్రయాణం అవుతారు. భక్తులకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం.
ఆలయ వైస్ చైర్మన్ – పిసరి చిన్న భూమయ్య.

శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని శివరాత్రి జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు ఘనంగా పూర్తి చేస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని వీడిసి వైస్ చేర్మెన్ పిసరి రెడ్డి తెలిపారు. ఆలయంలో గ్రామ యోగక్షేమాలు కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, అనంతరం భక్తులకు ఆలయ ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. స్వామి వారిని దర్శించుకోవడానికి ఈ సంవత్సరం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున క్యూ లైన్ లో వెళ్ళేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. జాతరకు వచ్చిపోయే భక్తులకు దాతల సహాయంతో అన్నదానం ఏర్పాట్లు చేస్తున్నాం, నీటి టాంకర్ల ద్వారా త్రాగు నీరు వసతి కల్పిస్తాం.. కార్యక్రమంలో గ్రామంలోని అన్ని కుల సంఘాలు, ఆలయ కమిటి సభ్యులు వారి సేవలు అందిస్తారు. అంత్యంత వైభవంగా జరుపబడే శ్రీ భవాని శంభులింగేశ్వర వారి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News