Saturday, March 21, 2026

పేరూరు ఆశ్రమ ఉన్నత పాఠశాల లో ఆరోగ్య వైద్య శిబిరం

  • హాజరైన డిప్యూటీ డిఎంహెచ్ఓ క్రాంతి కుమార్

నేటి/సాక్షి వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు ఏహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం ఐటీడీఏ ఏటూరి నాగారం పిఓ ఆదేశాల మేరకు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ యోషిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరం నందు 80 మందికి బాల బాలికలకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయేతర సిబ్బంది కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా జ్వర పీడితులు ఎవరు కూడా నమోదు అవ్వలేదని, జలుబు దగ్గుకు 20 మందికి చికిత్స చేయడం జరిగింది అంతే కాకుండా మిగతా వారికి కూడా చిన్న వ్యాధులకు చికిత్స చేయడం జరిగింది. బాల బాలికలకు ఆరోగ్య విషయాల మీద అవగాహన గూర్చి ఆరోగ్య విద్యా బోధన చేయటం వసతి గృహ ఆవరణలో వంటశాల ప్రాంతంలో పరిశుభ్రత త్రాగునీటిని పరిశీలించడం జరిగింది. హాస్టల్ నందు పని చేస్తున్న ఏఎన్ఎం జ్వరము అస్వస్థత వస్తే ప్రథమ చికిత్స చేసి దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. ముందుస్తు జాగ్రత్తల చర్యలలో భాగంగా 5% ఆల్పా సైపర్ మైత్రిన్ అనే దోమల మందును హాస్టల్ వంటశాల, పాఠశాల ఆవరణ లోపల పిచికారి చేయడం జరిగింది అని డాక్టర్ యోషిత తెలిపారు. ఈయొక్క కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ క్రాంతి కుమార్ డాక్టర్ యోషిత ఎన్.హెచ్.ఎం.ప్రోగ్రాం ఆఫీసర్ మహేందర్, హెచ్.ఇ.ఓ. వేణుగోపాలకృష్ణ, పి.హెచ్.ఎన్. సంగీత, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి, ఎం సి హెచ్ నర్సింగ్ ఆఫీసర్ అనూష, ఏఎన్ఎం శకుంతల, ఆరోగ్య కార్యకర్త శ్రీను ఆశ్రమ స్కూలు ప్రధానోపాధ్యాయులు వార్డెన్ వారి సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News