నేటిసాక్షి, వరంగల్ :
రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన వర్ధన్నపేట డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. మోహన్ సింగ్ శుక్రవారం రోజున ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మరియు స్టాఫ్ తో మాట్లాడుతూ ఉద్యోగులందరూ సమయ పాలన పాటించాలని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలని సమాజ ఆరోగ్య నిర్మాణానికి పాటుపడాలని తెలిపారు, రికార్డులను రిపోర్టులను చెక్ చేశారు, అన్ని జాతీయ ప్రోగ్రామ్స్ 100% రిచ్ కావాలని పర్ఫామెన్స్ పెంచేటట్టు చేయాలని స్టాఫ్ ను మరియు డాక్టర్ కు చెప్పారు. అనంతరం ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల వేడి ఆహారం, సాయంత్రం 7 నుండి ఉదయం 8 గంటల వరకు పిల్లలు మరియు వృద్ధులు బయటికి వెళ్లకూడదని, చలి బాగా ఉందని, ఒకవేళ అత్యవసర పరిస్థితిలో వెళితే వెచ్చని బట్టలు వేసుకొని వెళ్లాలని ప్రజలకు హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్. హారిక, సూపర్వైజర్ ఎం. భాగ్యలక్ష్మి, ఏ. ఎన్.ఎం.లు మరియు తదితరులు పాల్గొన్నారు.