Saturday, March 21, 2026

అభిమాన కుటుంభాలకు ఆత్మీయ పరామర్శలు

  • మాజీ ఎమ్మెల్యే

నేటి సాక్ష, అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : హసనాపురం గ్రామంలో పలువురి వైఎస్ఆర్ సిపి నాయకుల కుటుంబాలను పరామర్శించిన శ్రీకాంత్ రెడ్డి పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు తనవంతు ధైర్యాన్ని ఇస్తూ తానున్నానంటూ భరోసా కల్పించడం మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి నైజం. కష్టాలు, బాధలు, ఇబ్బందులలో ఉన్న వారిని ఆదుకోవడం ధైర్యం కల్పించడం, తోడుగా నిలవడం శ్రీకాంత్ రెడ్డి మంచి మనసుకు నిదర్శనం. ఈ క్రమంలోనే రామాపురం మండలం హసనాపురం గ్రామంలో పలువురి వైఎస్ఆర్ సిపి నాయకుల కుటుంబాలను సోమవారం వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పరామర్శించారు. కొండావాండ్లపల్లెలో నెర్సుపల్లె రామిరెడ్డి, తాటిగుట్ల భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మీ ప్రసన్న లు ఇటీవల మృతి చెందారు. వాల్ల కుటుంబాలను శ్రీకాంత్ రెడ్డి పరామర్శించారు. గొల్లపల్లె లో పప్పిరెడ్డి పాపిరెడ్డి, చీకటి వాండ్లపల్లెలో చీకటి రామచంద్ర మాతృమూర్తి లు ఇటీవల మృతి చెందారు. వారి నివాసాలకు శ్రీకాంత్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. పప్పిరెడ్డిగారిపల్లెలో పప్పిరెడ్డి రవీంద్రా రెడ్డికి కాలు బెనికి ఇంటి వద్ద విశ్రాంతి పొందుచున్నారు. ఇతనినీ శ్రీకాంత్ రెడ్డి పరామర్శించారు. పప్పిరెడ్డి సుధాకర్ రెడ్డి నివాసానికి శ్రీకాంత్ రెడ్డి వెళ్లి ఆరోగ్య పరిస్థితులనడిగి తెలుసుకున్నారు. చిట్లూరు గ్రామంలో చిట్లూరు గ్రామం పాలన్నగారి పల్లెలో వెంకట్రామి రెడ్డి మాతృమూర్తి రామలక్ష్మమ్మ మృతిచెందారు. వారి నివాసానికి శ్రీకాంత్ రెడ్డి వెళ్లి ఆమె మృతిపట్ల సంతాపం తెలిపి వారి కుటుంభ సభ్యులను పరామర్శించారు.

రైతులు, ప్రజలతో శ్రీకాంత్ రెడ్డి మమేకం.
హసనాపురం, చిట్లూరు గ్రామాల రైతులు, ప్రజలతో శ్రీకాంత్ రెడ్డి మమేక మయ్యారు. వర్షాలు లేక కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని, బోర్లలో నీళ్లు రాక పంటలు దెబ్బతింటున్నాయని రైతులు శ్రీకాంత్ రెడ్డి దృష్టికి తీసుకుకచ్చారు.వేరుశనగ పంట దెబ్బతిన్నా, ఈ ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ కూడా అందివ్వ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం పంటలు దెబ్బతింటే ఇన్ పుట్ సబ్సిడీ క్రమం తప్పకుండా అందించేదని రైతులు గుర్తు చేశారు. వ్యవసాయ, కూలీ పనులు తగ్గాయని, ఈ ప్రభుత్వంలో రైతు భరోసా పెట్టుబడి నిధులు అందక రైతులము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ శ్రీకాంత్ రెడ్డి ఎదుట రైతన్నలు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కరవు రైతు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి రవి శంకర్ రెడ్డి, సర్పంచ్ రామాంజులు,మాజీ సర్పంచ్ రాజారెడ్డి, వైఎస్ఆర్ సిపి నాయకులు రిటైర్డ్ లెక్షరర్ ఈశ్వర్ రెడ్డి, చలమారెడ్డి, నాగేంద్ర రెడ్డి, మాజీ ఎంపిటిసి సాగినాల శివ శంకర్, సోమేశ్వర రెడ్డి, ఆంజనేయ రెడ్డి, ఆదిరెడ్డి, నారాయణరెడ్డి, పూజిత్, వినోద్, చెన్నంశెట్టి శివయ్య, రంగారెడ్డి, అమరనాధ రెడ్డి, శ్రీను, మహమ్మద్ ఖాన్ నరసింహులు, వెంకట సుబ్బారెడ్డి, సుధాకర్, అయోధ్యాపురం వినోద్ రెడ్డి, సాంబశివ, మణికంఠ, చిన్నరెడ్డెయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News