- లక్ష డప్పులు వెయ్యి గొంతులు మినీ మహాప్రదర్శనను విజయవంతం చేద్దాం
- ఇర్కిచేడు గ్రామ ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కే టి దొడ్డి ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గువ్వలదిన్నె జంబయ్య మాదిగ
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ రమేష్ : కే టి దొడ్డి మండలం :బుధవారం మండలం ఇర్కిచేడు గ్రామంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడమైనది. సమావేశానికి గ్రామ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కే టి దొడ్డి ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గువ్వలదిన్నెజంబయ్య మాదిగ పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి కే టి దొడ్డి ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గువ్వలదిన్నెజంబయ్య మాదిగ మాట్లాడుతూ…. ఈనెల 30వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ విచ్చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా జిల్లా కేంద్రంలో లక్ష డబ్బులు వెయ్యి గొంతులు మినీ కళా ప్రదర్శనకు గట్టు మండలంలోని అన్ని గ్రామాల మాదిగలతో ఇందువాసి మాదిగ సోదరులు కూడా ప్రతి ఒక్కరూ డప్పులు చేత పట్టుకొని గద్వాల నడిబొడ్డున దద్దరిల్లించే విధంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇర్కిచేడు గ్రామ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు లక్ష్మణ్, కళాకారుల సంఘం జిల్లా నాయకులు డప్పు రంగస్వామి, గోపి, తిప్పయ్య, జయన్న, అంజి, ముని, బస్వారాజ్, నర్సింహా, మధు, సిద్దప్ప, సుధాకర్,రమేష్, యల్లప్ప, సింతలయ్య, నర్సింలు, చిన్న నర్సింలు, వై నర్సింలు, ప్రకాష్, యేసయ్య, టైగర్, జై కృష్ణ, ఊరకుండు, ఎఱ్ఱన్న, రంగప్ప, హన్మంతు, ముకన్నా, జంగిలప్ప, రంగప్ప, వన్నప్ప,టైలర్ నర్సింలు, భాస్కర్, ఆంజనేయులు, వీరేష్,హోటల్ నర్సింహా, మసాలా జిందప్ప, తాతప్పజంగిలప్ప, చిన్న నర్సప్ప, ఆటో నర్సింహా, ఛత్రపతి పాల్గొన్నారు.





