- మహేశ్వరం గడ్డపై మాదిగల మహా యుద్ధభేరిని వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరుగు లక్ష డప్పుల వేల గొంతులో భారీ సంస్కృతిక మహా ప్రదర్శన విజయవంతం చేయడం కొరకై మహేశ్వర మండల కేంద్రంలో వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్ట గళ్ళ ప్రశాంత్ మాదిగ ఎమ్మార్పీఎస్ మహేశ్వర మండల ఇన్చార్జి బక్కని రవి మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులుగణేష్ మాదిగ మాట్లాడుతూ మహేశ్వర మండలంలోని అన్ని గ్రామాల నుంచి ఎమ్మార్పీఎస్ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులందరూ పెద్ద ఎత్తున బయలుదేరి విజయవంతం చేయాలనిపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. ఎర్ర నవీన్ మాదిగ జంగయ్య మాదిగ స్వామి మాదిగ పెండ్యాల.బాల్రాజ్, స్వామి, అర్జున్, మల్లేష్, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.





